రాజంపేట అర్బన్ : విభిన్న ప్రతిభావంతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని శాసనసభ్యులు మేడా మల్లికార్జునరెడ్డి అన్నారు. శుక్రవారం మన్నూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అలింకో కాన్పూర్ కంపెనీవారు వికలాంగుల ప్రత్యేక అవసరాలకు కోసం అవసరమైన పరికరాలను అందించేందుకు నిర్వహించిన విభిన్న ప్రతిభావంతుల నుంచి దరఖాస్తుల స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వికలాంగుల సంక్షేమ శాఖ ఏ.డి ఆర్.వి కష్ణ కిషోర్, కాన్పూర్ అలింకో కంపెనీ కో-ఆర్డినేటర్ సునీతతో మాట్లాడి సదస్సుకు హాజరైన విభిన్న ప్రతిభావంతులందరి నుంచి దరఖాస్తులు స్వీకరించి చిన్నచిన్న పొరపాట్లు ఉన్నప్పటికీ వాటిని పక్కన పెట్టి వారి ప్రత్యేక అవసరాల కోసం ఏ పరికరాలు అయితే వారికి అవసరమో వాటిని వారికి అందించేందుకు చర్యలు చేపట్టాలని తెలిపారు. కార్యక్రమానికి రాజంపేట నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి విచ్చేసిన విభిన్న ప్రతిభావంతులకు ఎమ్మెల్యే తాగునీరు, భోజన వసతిని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు వడ్డే రమణ, హస్తవరం ఉమామహేశ్వర్ రెడ్డి, ఎంపీటీసీ బాబు, సత్యాల రామకష్ణ, మురళి ఆచారి, మిరియాల సురేఖ, రాజేష్ ఆచారి, శ్రీరాములు, వడ్డే శ్రీను పాల్గొన్నారు.










