
ప్రజాశక్తి-రావికమతం:మండలంలోని మేడివాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సహిత విద్యా విభాగం వనరుల గదిలో దివ్యాంగ విద్యార్థులకు వీల్ చైర్లు, ఎం.ఆర్ కిట్లు, వినికిడి యంత్రాలను అనకాపల్లి జిల్లా విద్యాశాఖ అధికారిణి ఎం.వెంకట లక్ష్మమ్మ అందజేశారు. తరగతి గదిలోని విద్యార్థులు బోధన సామర్థ్యాలను పరిశీలించారు. విద్యార్థులను ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. విద్యార్థుల నోట్ బుక్స్ ను పరిశీలించారు. పాఠశాలలో నాడు నేడు పనులను పర్యవేక్షించి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ, దివ్యాంగ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పాఠశాల విద్యాశాఖ- సమగ్ర శిక్ష భవితా కేంద్రాల ద్వారా అన్ని రకాల సేవలు, సదుపాయాలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఉచితంగా ఉపకరణాలను, అలవెన్సులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. వీటిని ప్రత్యేక అవసరాల పిల్లలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దివ్యాంగ విద్యార్థుల అభివృద్ధికి అందరూ తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా విద్యాశాఖ సూపరిండెంట్ వెంకటేశ్వరరావు, మండల విద్యాశాఖాధికారులు సి.హెచ్ తలుపులు, బ్రహ్మాజీ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి.రామారావు, స్కూల్ అసిస్టెంట్, ప్రత్యేక ఉపాధ్యాయులు మహాలక్ష్మి నాయుడు, జగన్నాథ నాయుడు, సిఆర్పిలు రామారావు, శ్రీను, చిలుకమ్మ, శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.