రాయచోటి : విభిన్న ప్రతిభావంతుల అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కషి చేస్తుందని కలెక్టర్ గిరీష పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లో జిల్లా విభిన్న ప్రతిభావంతులు, వయోవద్ధుల సహాయ సంస్థ, అన్నమయ్య రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రాయచోటి నియో జకవర్గంలోని విభిన్న ప్రతిభా వంతులకు ట్రై సైకిల్స్, త్రీ వీలర్ మోటార్ వెహికల్స్, వినికిడి యంత్రాలు, వీల్ చైర్స్‌లను కలెక్టర్, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఫయా జ్‌బాష, డిఆర్‌ఒ సత్యనారాయణ చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అర్హత కల్గిన వారందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పాలన సాగుతుం దన్నారు. అందరికీ సమాంతరంగా ప్రభుత్వ ఫలాలను అందిస్తుందని వివరించారు. విభిన్న ప్రతిభావంతులకు విలువైన వాహనాలను ప్రభుత్వం వీరికి పూర్తిగా ఉచితంగా అందజేసినట్లు తెలిపారు. దాదాపు వందమందికి ట్రై సైకిల్స్, త్రీ వీలర్ మోటార్ వెహికల్స్, వినికిడి యంత్రాలు, వీల్ చైర్స్ వివిధ రకాల పరికరాలను అందజేశామన్నారు. త్రీ వీలర్ మోటరైజ్డ్ వెహికల్స్ సుమారు రూ. 45 వేలు విలువ చేస్తుందన్నారు. రాయచోటి, రాజంపేట, రైల్వే కోడూరు నియోజవర్గాల్లో విభిన్న ప్రతిభావంతులకు జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున క్యాంపు నిర్వహించి అర్హులైన వారందరికీ అన్ని పరికరాలు అందజేస్తామన్నారు. వికలాంగుల కోసం కత్రిమ పరికరాలు తయారు చేయ డానికి కొలతలు తీసుకోవడానికి క్యాంపులు కూడా వికలాం గుల సంక్షేమ శాఖ నిర్వహిస్తుందన్నారు. అర్హులు జిల్లా కేంద్రంలో వికలాంగుల సంక్షేమ శాఖ కార్యాలయంలో వివ రాలను నమోదు చేసుకోవచ్చన్నారు. ఎమ్మెల్యే మాట్లా డుతూ విభిన్న ప్రతిభావంతుల్లో ఆత్మవిశ్వాసం పెంపొం దించడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఒక సంస్థతో మాట్లాడి ఎంతమంది అర్హత ఉంటే అంతమందికి పరికరాలు అందజేయాలని ప్రోత్సహించడంతో, అందుకు కలెక్టర్ మ్యాచింగ్ చేయడంతో ఇప్పుడు వంద మందికి వివిధ రకాల పరిక రాలను పంపిణీ చేశామని తెలిపారు. విభిన్న ప్రతిభా వంతులకు పరికరాలు అందజేసినందుకు ముఖ్యమంత్రి, ఎంపీ, కలెక్టర్‌కు ప్రత్యేక కతజ్ఞతలు తెలియజేశారు. గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమం వెళ్ళినప్పుడు విక లాంగుల స్థితిగతులు చెప్పినప్పుడు ఏదో రకంగా సహాయం ఉండాలని ఆలోచనతో కలెక్టర్ దష్టికి తీసుకెళ్తే ఇప్పుడు ఎన్ని ఉంటే అన్ని ఇచ్చేద్దాం అన్నారని చెప్పారు. రాజంపేట ఎంపీ మదనపల్లి, తంబాలపల్లి, పీలేరు నియోజకవర్గాల్లో వేలమంది విభిన్న ప్రతిభావంతులకు పరికరాలు అందజే శారన్నారు. రాబోవు నెల రోజుల్లో రాయచోటి, రాజంపేట, కోడూరు నియోజవర్గంలో పెద్ద క్యాంపు పెట్టి 2000 మందికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ వివిధ రకాల పరికరాలు పంపిణీ చేస్తామన్నారు. కాళ్లు కోల్పోయిన వాళ్లకు కత్రిమంగా ఏర్పాటుకు వికలాంగుల సంక్షేమ శాఖ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఇ వీటితోపాటు వినికిడి యంత్రాలు కూడా అందిస్తున్నామన్నారు. ప్రభుత్వం మానవత్వంతో చేస్తున్న దానికి ఇది ఒక నిదర్శనం అన్నారు. ప్రతి వ్యక్తిలో ఒక ప్రత్యేకత, నైపుణ్యం ఉంటుందని చెప్పారు. సమాజంలో ఉన్నత స్థాయిలో జీవించడానికి వికలాం గులకు అంగవైకల్యం అడ్డుకాదని పట్టుదలతో కషి చేస్తే లక్ష్యాలను సాధించవచ్చని అన్నారు. ప్రభుత్వపరంగా విభిన్నప్రతిభావంతులకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, వికలాంగుల, వయోవద్ధుల సంక్షేమ శాఖ ఏడి కిషోర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.










