విఆర్వోలు ప్రజలకు అందుబాటులో ఉండాలి: ఎంపిపి
ప్రజాశక్తి -బైరెడ్డిపల్లి: విఆర్‌వోలు ప్రజలకు అందుబాటులో వుండాలని ఎంపిపి సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం మండల సర్వసభ్య సమావేశం ఎంపిపి రెడ్డెప్ప అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రెవిన్యూ శాఖ పై సమీక్షించారు. విఆర్వో లు ప్రజలకు అందుబాటులో ఉండాలని, సమస్యలు పై కాలయాపన చేయొద్దని దిశానిర్దేశం చేశారు. ఇంటి పట్టాలు కోసం స్థానిక సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని,రేషన్ కార్డు సమస్యలు, కొత్త రేషన్ కార్డులు మా వద్ద తెలపాలని తహశీల్దార్ కుమారస్వామి పేర్కొన్నారు. అలపల్లి విఆర్‌ఓ సమస్యల పరిష్కారం కోసం డబ్భులు డిమాండ్ చేస్తున్నారని అలపల్లి సర్పంచ్ రమణారెడ్డి పిర్యాదు చేసారు. దీనితో విఆర్వీ తీరుపై తహసీల్దార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. వి.ఆర్వో లు 3 నుండి5 గంటలు సచివాలయంలో ఉండాలని,గతంలో చెప్పిన మీరు ఎందుకు నిర్లక్యం వహిస్తున్నారని ఎం.పి.పి.రెడ్డెప్ప అసహనం వ్యక్తం చేశారు. ఆర్.బి.కె. సిబ్బంది ఎరువులు అమ్మిన వెంటనే డి.డి.కట్టాలని ,అవకతవకలు కు పాల్పడితే జీతాలు నిలిపివేస్తామని ఎం.పి.పి.రెడ్డెప్ప హెచ్చరించారు. మండలంలో 375 మెట్రిక్ టన్నులు యూరియా అమ్మకం చేపట్టింది అని మండల వ్యవసాయక అధికారి గీతకుమారి తెలిపారు.మండలంలో ఖరీఫ్ సీజన్లో సాధారణ వర్షపాతం కన్నా 40 శాతం తక్కువగా వర్షం కురిసింది అని వ్యవసాయ అధికారిణి పేర్కొన్నారు . టమోటా పంట కోసం మొక్కలను 20 పైసలకి పంపిణీ చేస్తామని, సాగుపై 50 శాతం సబ్సిడీ ఉంటుందని ఉద్యనశాఖ అధికారిణి ప్రసన్నలక్ష్మి తెలిపారు .రైతులు తమశాఖ రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.గొర్రెలు,మేకలు ఉన్న వారికి టీకాలు అందుబాటులో ఉన్నాయి అని పశువైద్యాధికారి వెంకటసాయి పేర్కొన్నారు. పశువులకు కావాల్సిన మందులు బయట తీసుకొని రావాలని పశు వైద్యాధికారి చీటీలు వ్రాయిస్తున్నారని ఇకమీదట అలాచేస్తే సహించం అని ఎంపిపి మండిపడ్డారు. మండలం లో 73 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయని వీటిలో 22 కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతోంది అని ఐసిడిఎస్ అధికారి పేర్కొన్నారు. మండలంలోని మిట్టకురపల్లి అంగన్వాడీ కేంద్ర భవనం చుట్టూఉన్న పేడ డిబ్భలు వెంటనే తొలగించడానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఎంపిపి రెడ్డెప్ప ఆదేశించారు. పసిబిడ్డల ప్రాణాలతో చెలగాటం వద్దని హెచ్చరించారు.బైరెడ్డిపల్లి లోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రం మంత్రి రామచంద్రారెడ్డి తో ప్రారంభించడం హర్షణీయం అని ప్రజల చిరకాల కోరిక అయిన 24 గంటలు వైద్య సౌకర్యం కల్పించడం కు కషి చేసిన మొగశాల బ్రదర్స్ ను ప్రజాప్రతినిధులు అభినందించారు. మండలంలో 17 సచివాలయంలలో జగన్ సురక్ష కార్యక్రమం కొనసాగుతోందని వైద్యులు తెలిపారు. అత్యవసర సమయాల్లో 108 వాహనమే కాదు 102 వాహనం కూడా వాడుకోవచ్చని సంభదిత శాఖ అధికారులు తెలిపారు. మిగిలిన శాఖల అభివద్ధి పై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు,ఎం.పి.టి.సి.లు ఎం.పి.డి.ఓ. రాజేంద్ర బాలాజీ,తహశీల్దార్ కుమారస్వామి,అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.










