Dec 18,2022 23:38

సమావేశంలో మాట్లాడుతున్న శ్రీ రామ్మూర్తి

ప్రజాశక్తి -తగరపువలస : విఆర్‌ఒలపై పని ఒత్తిడి తగ్గించాలని విఆర్‌ఒల సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఈర్లె శ్రీరామ్మూర్తి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం మండలంలోని తాళ్లవలసలో సంఘం జిల్లా అధ్యక్షులు పోతిన వెంకటఅప్పారావు అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కార్యవర్గ తొలి సమావేశంలో శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ, ఇటీవల కాలంలో విఆర్‌ఒలపై తీవ్రమైన పని ఒత్తిడి వల్ల మానసిక రుగ్మతలు, అనారోగ్యం పాలౌతున్నారన్నారు. క్షేత్రస్థాయిలో విఆర్‌ఒలు ఎదుర్కొంటున్న సమస్యలపై జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లాలని సమావేశంలో నిర్ణయించారు. సమావేశంలో సంఘం అనకాపల్లి జిల్లా అధ్యక్షులు ఎస్‌టి రామకాసు, కార్యదర్శి అనంతరామయ్య, విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి జి దేవరాజ్‌, భీమిలి డివిజన్‌ అధ్యక్ష, కార్యదర్శులు ఎంవి సుబ్బారావు,ఎం శ్రీనివాసరావు పాల్గొన్నారు.అనంతరం నూతన కార్యవర్గాన్ని అభినందించారు.