ప్రజాశక్తి-కాకినాడ రూరల్ కాకినాడ కలెక్టరేట్ ఎదురుగా ఉన్న ఎపిఆర్‌ఎస్‌ఎ రెవెన్యూ భవనంలో గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం జిల్లా కమిటీ ఎన్నికలు శనివారం ఎప జెఎసి అమరావతి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎపిఆర్‌ఎస్‌ఎ రాష్ట్ర నాయకుడు కె.చంద్రశేఖర్ రెడ్డి, ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు ఎస్.రామ్మోహన్, ఎపి అమరావతి జెఎసి వైస్ చైర్మన్ కె.శ్రీనివాసరావు ఈ ఎన్నికలకు ఎన్నికల అధికారులుగా వ్యవహరించారు. ఈ ఎన్నికలకు ముఖ్య అతిథులుగా విఆర్‌ఒ రాష్ట్ర సంఘం అధ్యక్షులు కోన ఆంజనేయ కుమార్ (చంటి), ప్రధాన కార్యదర్శి అనుపమ సహయ కార్యదర్శి కెఎ.చారి, ఉపాధ్యక్షుడు సాయి సత్యనారాయణ ప్రసాద్, శంకర్, జాయింట్ కార్యదర్శి కె.చిన్నారావు పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో జిల్లా అధ్యక్షులుగా సిహెచ్.చిన్నా, సహాధ్యక్షునిగా ఎస్‌వికెటి.సాయిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా జివి.సూరిబాబు ఉపాధ్యక్షునిగా పరమేశ్వర రాజు, ఎన్.సత్యనారాయణ, యు.నాగవేణి, కోశాధికారిగా బి.భాగయ్య మరియు 25 మంది సభ్యులతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.










