Nov 08,2022 21:58

ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
       ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించడంలో విఆర్‌ఒలు కీలకబాధ్యత వహిస్తూ సేవలందిస్తున్నారని జంగారెడ్డిగూడెం డివిజన్‌ విఅర్‌ఒ యూనియన్‌ అధ్యక్షులు అడపా రాంబాబు అన్నారు. మంగళవారం ఆర్‌డిఒ జాన్సీ రాణికి విఅర్‌ఒల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ విఆర్‌ఒలు రెవెన్యూ సేవలందించడంలో సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి లాప్‌టాప్‌ సౌకర్యాన్ని కల్పించాలని కోరారు. అలాగే స్టేషనరీ రికార్డుల ఖర్చులను కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ కొయ్యలగూడెం మండల అధ్యక్షులు పి.ఏసుబాబు, జంగారెడ్డిగూడెం మండల అధ్యక్షులు జిల్లా బాబూరావు, పలువురు విఅర్‌ఒలు పాల్గొన్నారు.