ప్రజాశక్తి - హోళగుంద
విఆర్‌ఎలకు పే స్కేల్ అమలు చేయాలని సిపిఎం, సిఐటియు మండల కార్యదర్శులు వెంకటేష్, నాగరాజు డిమాండ్ చేశారు. విఆర్‌ఎల సమస్యల పరిష్కారం కోసం శుక్రవారం రెండోరోజు దీక్షలు చేపటాటరు. ఈ దీక్షలకు సిఐటియు మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా వెంకటేష్, నాగరాజు, విఆర్‌ఎల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మల్లయ్య మాట్లాడారు. అధికారం చేపట్టిన వెంటనే విఆర్‌ఎలకు పే స్కేల్ వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హామీఇచ్చారని తెలిపారు. వన్ టైం సెటిల్‌మెంట్ కింద 60 ఏళ్లు దాటిన ప్రతి విఆర్‌ఎ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని, విఆర్‌ఎకు విఆర్‌ఒ ప్రమోషన్ కల్పిస్తామని వాగ్దానాలు చేశారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా ఇంతవరకు సమస్యలు పరిష్కరించలేదని విమర్శించారు. విఆర్‌ఎలకు టిఎ, డిఎలు నిలిపేసి ఒక్కో విఆర్‌ఎతో రూ.19,200 రికవరీ చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. తక్షణమే విఆర్‌ఎలకు ఇచ్చిన హామీలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సిద్ధలింగ, మౌలాలి, లక్ష్మి, జయప్ప, మహేష్, సోము పాల్గొన్నారు. ఆలూరు తహశీల్దార్ కార్యాలయం ముందు రెండోరోజు విఆర్‌ఎలు నిరసన దీక్ష చేపట్టారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కెపి.నారాయణ స్వామి మద్దతు తెలిపి మాట్లాడారు. విఆర్‌ఎల సంఘం డివిజన్ కార్యదర్శి అశోక్, మండల అధ్యక్ష, కార్యదర్శులు కోటప్ప, చెన్నప్ప, తిమ్మన్న, కుమార్, నాగరాజు, వీరేష్ పాల్గొన్నారు. గోనెగండ్లలోని తహశీల్దార్ కార్యాలయం ఎదుట శిబిరం ఏర్పాటు చేసి దీక్షలో కూర్చున్నారు. తహశీల్దార్ వేణుగోపాల్‌కు వినతిపత్రం అందజేశారు. రంగన్న, రామాంజనేయులు, హనుమంతు, పెద్ద బజారి, మోహన్, లక్ష్మీ, దస్తగిరి, టి.రంగన్న పాల్గొన్నారు.
హోళగుందలో మాట్లాడుతున్న నాయకులు










