ప్రజాశక్తి కొత్తచెరువు : విఆర్‌ఎల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని విఆర్‌ఎల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పెద్దన్న, మండల అధ్యక్షులు శివప్రసాద్, నాయకులు చెన్నయ్య, సాయి, గంగాధర్ డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తహశీల్దార్ కార్యాలయం ఎదుట విఆర్‌ఎలు చేపట్టిన నిరసన దీక్షలు శుక్రవారానికి రెండోరోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విఆర్‌ఎల సమస్యల పరిష్కారం కోసం నాలుగు సంవత్సరాలుగా పోరాటాలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. తక్షణమే విఆర్‌ఎలకు కనీసన వేతనం 26వేల రూపాయలు ఇవ్వాలని అర్హులకు ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం డిప్యూటీ తహశీల్దార్ స్వాతికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్‌ఏలు బాబు, పద్మావతి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు
బుక్కపట్నం : విఆర్‌ఎలకు పే స్కేల్ అమలు చేసి నామినీలుగా పనిచేస్తున్న వారందరిని విఆర్‌ఎలుగా గుర్తించాలని ఆసంఘం నాయకులు డిమాండ్ చేశారు. విఆర్‌ఎల సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్‌తో స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన దీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో విఆర్‌ఎల మండల అధ్యక్షులు పెద్దన్న, చలపతి, పుల్లప్ప, నరసింహుడు, తిప్పన్న, చెన్నమ్మ తదితరులు పాల్గొన్నారు.
ముదిగుబ్బ : విఆర్‌ఎల సమస్యలు ప్రభుత్వానికి కనిపించవా అని సిపిఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాస్ ప్రశ్నించారు. విఆర్‌ఎలు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న పలు సమస్యలను తీర్చాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్త దీక్షలలో భాగంగా ముదిగుబ్బ మండలంలోని వీఆర్‌ఏలు స్థానిక రెవెన్యూ కార్యాలయం ఎదుట చేపట్టిన దీక్షా కార్యక్రమానికి రెండవ రోజు సిపిఐ మద్దతు తెలిపింది. ఈ కార్యక్రమంలో నాయకులు, విఆర్‌ఎలు తదితరులు పాల్గొన్నారు.
హిందూపురం : విఆర్‌ఎల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తు చేపట్టిన రీలే దీక్షలు రెండో రోజు శుక్రవారం కొనసాగాయి. హిందూపురంలో నిర్వహించిన రిలేదీక్షలకు సిఐటియు పట్టణ కార్యదర్శి నరసింహప్ప, రాము మద్దతు పలికారు. ఈ సందర్బంగా అర్ద నగంగా దీక్షా శిబిరంలో మోకాళ్లపై కుర్చొనినిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో విఆర్‌ఎల సంఘం నాయకులు గంగప్ప, నారాయణప్ప, లక్ష్మీ నరసప్ప, రంజిత్, కోటిపి లక్ష్మీ, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
పెనుకొండ : సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన రిలే నిరాహార దీక్షల్లో భాగంగా శుక్రవారం విఆర్‌ఎలు పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయం వద్ద అర్ధనగ ప్రదర్శన చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ సిఎం జగన్ విఆర్‌ఎలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. దీక్షలో సిఐటియు మండల కార్యదర్శి బాబావలి, విఆర్‌ఎల సం ఘం నాయకులు ఆంజనేయులు, నరసప్ప, పుల్లన్న, గోవిందప్ప, సుబ్బరాయుడు, చెన్నకేశవులు, తదితరులు పాల్గొన్నారు.










