Jul 20,2023 19:35

ప్రజాశక్తి - బుట్టాయగూడెం
        సమస్యలు పరిష్కరించాలని కోరుతూ స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద విఆర్‌ఎలు గురువారం ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమానికి కెవిపిఎస్‌ జిల్లా కమిటీ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి ఎ.ఫ్రాన్సిస్‌ మాట్లాడుతూ అర్హత ఉన్న విఆర్‌ఎలకు ఉద్యోగోన్నతి కల్పించాలని, వేతనాలు పెంచాలని కోరారు. సిఎం జగన్‌ పాదయాత్ర సమయంలో విఆర్‌ఎలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కోటి పెద్దిరాజు, పటాన్‌వలీబాష, షేక్‌ ముంతాజ్‌, మహమ్మద్‌ దాదాసాహేబ్‌, షేక్‌ బాజీ బాష, రామకృష్ణ, వెంకటేష్‌, కన్నయ్య పాల్గొన్నారు.
నూజివీడు రూరల్‌ : తమ డిమాండ్‌ పరిష్కరించాలని కోరుతూ విఆర్‌ఎల రెండు రోజుల నిరసన కార్యక్రమంలో భాగంగా గురువారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు జి.రాజు, ఎన్‌ఆర్‌.హనుమాన్లు దీక్షా శిబిరానికి చేరుకుని సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో విఆర్‌ఎల యూనియన్‌ నాయకులు శ్రీను, ఖాన్‌, మనోహరం, రంగమ్మ పాల్గొన్నారు.