Aug 16,2022 23:52

బొప్పరాజుకు వినతి పత్రం అందజేస్తున్న విఆర్‌ఎల సంఘం జిల్లా అధ్యక్షులు

ప్రజాశక్తి -భీమునిపట్నం : విఆర్‌ఎల సమస్యలపై ఎపి రెవెన్యూ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లుకు విఆర్‌ఎల అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు బాందేపురపు సూరిబాబు మంగళవారం వినతిపత్రం అందజేశారు. స్థానిక తహశీల్దార్‌ కార్యాలయానికి వచ్చిన బొప్పరాజును కలిసి విఆర్‌ఎలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. విఆర్‌ఎ రికవరీ డిఎ జిఒను ప్రభుత్వం ఉపసహరించుకోవాలని, రికవరీ చేసిన డిఎను విఆర్‌ఎల బ్యాంక్‌ ఖాతాల్లో జమచేయాలని, కనీస వేతనం రూ.21 వేలు ఇవ్వాలని, నామినీలుగా పనిచేస్తున్న వారిని విఆర్‌ఎలుగా నియమించాలని కోరారు. ఖాళీగా ఉన్న అటెండర్‌, నైట్‌ వాచ్‌ మెన్‌ పోస్టులను విఆర్‌ఎలతో భర్తీ చేయాలని, అర్హత గల వారికి విఆర్‌ఒలుగా ఉద్యోగోన్నతి కల్పించాలని విజ్ఞప్తిచేశారు.