విఆర్‌ఏల సమస్యల పరిష్కారానికి కృషి
ప్రజాశక్తి - చాగలమర్రి
రాష్ట్రంలోని విఆర్‌ఏలు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని విఆర్‌ఏల సంఘం నూతన రాష్ట్ర అధ్యక్షుడు ధైర్యం తెలిపారు. చాగలమర్రికి విచ్చేసిన నూతన రాష్ట్ర అధ్యక్షుడుని మండల విఆర్‌ఏల సంఘం శనివారం ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విఆర్‌ఏలకు ఇంటర్ విద్య అర్హతతో విఆర్‌ఓలుగా పదోన్నతి కల్పించాలన్నారు. ఫేస్ యాప్ నుంచి విఆర్‌ఏ లను మినహాయించాలన్నారు. విఆర్‌ఏలకు టిఏ, డిఏలతో కూడిన వేతనం చెల్లించాలని, వృధ్దాప్యంలో ఉన్న విఆర్‌ఏల వారసులను నామీనీలుగా గుర్తించాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు విఆర్ ఏలను అర్హులుగా చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. కార్య క్రమంలో మండల విఆర్‌ఏల సంఘం అధ్యక్షుడు అబ్దుల్ గఫార్, సంఘ నాయకులు ఆనంద్,దస్తగిరి,నరసింహ,మహబూబ్‌బాషలు పాల్గొన్నారు.










