ప్రజాశక్తి - ఉంగుటూరు
నారాయణపురం మహాత్మాగాంధీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2023లో ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థిని కురిటి హేమలత వెళ్ళూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(విఐటి) డ్రీమ్డ్ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ సీటు సాధించినట్లు నారాయణపురం కళాశాల ప్రిన్సిపల్ బివి శ్రీనివాస్ తెలిపారు. హేమలత నారాయణపురం కాలేజీలో ఎంపిసి గ్రూపులో 1000/931 మార్కులు సాధించి జిల్లాస్థాయి బ్రిలియంట్ అవార్డు తీసుకుంది. ఈ క్రమంలో ఇంటర్‌లో మంచి మార్కులు సాధించిన కారణంగా విఐటిలో నాలుగేళ్లపాటు ఉచితంగా హాస్టల్ వసతి కల్పించి ఇంజనీరింగ్ విద్యను చదివేందుకు అవకాశం కల్పిస్తూ హేమలతను ఎంపిక చేశారు. ఈనెల 17న అమరావతిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని తెలిపారు. హేమలత తల్లిదండ్రులు నారాయణపురంలో వ్యవసాయ కూలీలు. కష్టపడి మంచి మార్కులు సాధించి ఏలూరు జిల్లా నుంచి హేమలత ఒక్కరే విఐటికి ఎంపి కావటం పట్ల డివిఇఒ ప్రభాకర్రావు, గ్రామస్తులు ఆమెను అభినందించారు.










