Dec 12,2022 22:40

ప్రజాశక్తి - ఏలూరు
              ఇటీవల గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో నిర్వహించిన తొమ్మిదో రాష్ట్ర యువజన జూనియర్‌, సీనియర్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో ఏలూరు ఎన్‌ఆర్‌ఐ విద్యాసంస్థల డిగ్రీ విద్యార్థి యు.కావ్యశ్రీలక్ష్మి వెండి, రజిత పతకాలు సాధించినట్లు కళాశాలల సిఇఒ వి.తులసీరామ్‌ తెలిపారు. కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థిని సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా తులసీరామ్‌ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా నైపుణ్యాన్ని ప్రదర్శించడం ద్వారా భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాల లభ్యతలో ప్రాధాన్యత పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ సిహెచ్‌ఎన్‌వి.సత్యనారాయణ, వైస్‌ ప్రిన్సిపల్‌ జి.సంజీవరావు, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు