Dec 01,2022 23:55

ప్రహరీ గోడను ప్రారంభిస్తున్న ముత్యాలనాయుడు

ప్రజాశక్తి- చీడికాడ:రెవిన్యూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు అన్నారు. చీడికాడ తహసిల్దార్‌ కార్యాలయం ఆధునీకరణలో భాగంగా నిర్మించిన ప్రహరీ గోడను ముత్యాల నాయుడు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తహసీల్దార్‌ కార్యాలయం ఆధునికరణకు కృషి చేసిన తహసిల్దార్‌ బివి రాణిని అభినందించారు. రైతుల భూ సమస్యలు త్వరితగతిన పరిష్కరిం చడానికి జగనన్న భూ రీసర్వేను ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ రీ సర్వేతో ఏళ్ల తరబడి ఉన్న భూ సమస్యలు పరిష్కారం అవుతున్నాయన్నారు.
తహసిల్దార్‌ బిబి రాణి మాట్లాడుతూ, మండలంలో రెవెన్యూ సమస్యల పరిష్కారంకు తన వంతు కృషి చేస్తానని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కురచా జయమ్మ నారాయణమూర్తి, జడ్పిటిసి లాలం శారదా వరలక్ష్మి జానకిరామ్‌, మండల వైసీపీ కన్వీనర్‌ గొల్లవిల్లి రాజుబాబు, యూత్‌ కన్వీనర్‌ గొల్లవిల్లి స్వామి నాయుడు, మండల వ్యవసాయ వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్‌ ఎర్ర అప్పారావు, వైసిపి నాయకులు పరువాడ అప్పారావు, మహేష్‌ రామారావు, బొడ్డు అప్పలనాయుడు, సుంకరి శ్రీనివాసరావు, డిటి రమేష్‌ ఆర్‌ఐలు, వీఆర్వోలు, పాల్గొన్నారు.