Feb 15,2023 00:02

ఉప విద్యాశాఖాధికారి ప్రేమ్‌ కుమార్‌

ప్రజాశక్తి-నక్కపల్లి:చదువులో వెనుకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని ఎలమంచిలి ఉప విద్యాశాఖాధికారి ప్రేమ్‌ కుమార్‌ సూచించారు. మండలంలోని వేంపాడు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మంగళవారం హెచ్‌ఎం కోడి శ్రీనివాసరావు పర్యవేక్షణలో జరిగిన లిప్‌ అభ్యసనాభివృద్ధి శిక్షణా తరగ తులను ఆయన సందర్శించి మాట్లాడారు. విద్యార్థుల స్థాయిని అనుసరించి విద్యా బోధన చేయాలని, ప్రతి విద్యార్థికి ధారాళంగా చదవడం, రాయడం రావాలన్నారు. పదో తరగతి పరీక్షల్లో శత శాతం ఉత్తీర్ణత సాధించాల న్నారు. అనంతరం ఎంఈఓ డివిడి ప్రసాద్‌తో కలిసి పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకాన్ని పరిశీలిం చారు.రిసోర్స్‌ పర్సన్‌లుగా వేమగిరి నూకరాజు, కోట్ని సత్తిబాబు వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో నక్కపల్లి, పాయకరావుపేట మండలాలకు చెందిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు..