
భోజనాన్ని రుచి చూస్తున్న ఉదయశ్రీ
ప్రజాశక్తి-నక్కపల్లి:మండలంలో వేంపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను బుధవారం డిఎల్‌డిఓ ఉదయశ్రీ సందర్శించారు. విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలను పరిశీలించారు. పాఠశాలలో వెనుకబడిన విద్యార్థులకు ఉపాధ్యాయులు చేపడుతున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉపాధ్యాయులకు సూచించారు. మెరుగైన ఫలితాలు సాధనకు కృషి చేయాలన్నారు. బైజూస్ ట్యాబ్‌లను పరిశీలించారు. మద్యాహ్న భోజనాన్ని రుచి చూశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం పోషకాహారాన్ని అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నూకరత్నం, హెచ్‌ఎం నర్సింగరావు, పంచాయతీ కార్యదర్శి శ్రీను పాల్గొన్నారు.