ప్రజాశక్తి -తగరపువలస : చదువులో వెనుకబడిన విద్యార్థులకు అవసరమనుకుంటే ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఉపాధ్యాయులకు విద్యాశాఖ రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.శ్రీనివాసరావు సూచించారు. జివిఎంసి ఒకటో వార్డు పరిధి బంగ్లామెట్ట ప్రాథమిక పాఠశాలను సోమవారం ఆయన సందర్శించారు. జెవికె కిట్లు ఏ మేరకు అందినవీ విద్యార్థులనడిగి తెలుసుకున్నారు. నాడు, నేడు పథకంలో భాగంగా ఇప్పటికే చేపట్టిన పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. విద్యార్థుల నోట్ బుక్స్‌ను పరిశీలించారు. విద్యా శాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ ఎం.జ్యోతికుమారి, జిల్లా విద్యా శాఖాధికారి ఎల్.చంద్రకళ, సమగ్ర శిక్ష ఇఇ డివి.నరసింహారావు, ఎఇ మహాలక్ష్మి, అకడమిక్ మానిటరింగ్ అధికారి లక్ష్మి, ఎంఇఒలు 1, 2 లు కెఎ.బాలామణి, అట్టాడ జయప్రద, పాఠశాల హెచ్‌ఎం రెడ్డిపల్లి అప్పలరాజు పాల్గొన్నారు.
కెజిబివి సందర్శన
భీమిలి, గొల్లలపాలెంలో ఉన్న కెజిబివిని కూడా శ్రీనివాసరావు సందర్శించారు. వంట గదిని పరిశీలించారు. మెనూ అమలు తీరును విద్యార్థినులనడిగి తెలుసుకున్నారు. తాగు నీటి సమస్య ఉందని విద్యార్థినులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థినుల తల్లిదండ్రులతో సమావేశమై చర్చించారు. డిప్యూటీ ఎడ్యుకేషనల్ అధికారి గౌరీ శంకర్, జిసిడిఒ ఖలీశా బేగం, కెజిబివి స్పెషల్ ఆఫీసర్ గంగా కుమారి పాల్గొన్నారు.










