ప్రజాశక్తి-చింతూరు : అనారోగ్యంతో కామ్రేడ్ బొగ్గా వెంకటరాముడు (48) మృతి చెందడం సిపిఎంకు తీరనిలోటని ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు అన్నారు. ఆదివారం సిపిఎం మండల కమిటీ నాయకులు సీసం సురేష్, ఎర్రంశెట్టి శ్రీనివాస్ తదితరులు వెంకటరాముడు కుటుంబాన్ని పరామర్శించి, వెంకట్రాముడు భౌతిక కాయంపై పార్టీ జండా కప్పి నివాళి అర్పించారు. ఈ సందర్బంగా పార్టీ శాఖ ముఖ్య బాధ్యులు మాట్లాడుతూ చిడుమురు గ్రామశాఖ సీనియర్‌సభ్యుడిగా వెంకటరాముడు 2000నుంచి పార్టీలో కొనసాగుతూ, చిడుమురు గ్రామ పంచాయతీ పరిధిలో పార్టీ ప్రజా ప్రతినిధులు గెలుపులో ముఖ్య పాత్ర పోషించారన్నారు.కామ్రేడ్ వెంకటరాముడు మరణం పార్టీకి, వారి కుటుంబానికి తీరని లోటని, ఆయన కుటుంబానికి పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసానిచ్చారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మడకం శేషయ్య, రాఘవయ్య, గిరిజ, చిడుమురు ఎంపిటిసి ముర్రం, లక్ష్మి, ముర్రం పిడగయ్య పాల్గొన్నారు.










