Aug 27,2023 18:23

నివాళి అర్పిస్తున్న మంత్రి కాకాణి

ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు :మండలంలోని కొత్త కోడూరు గ్రామానికి చెందిన వైసిపి సీనియర్‌ నాయకులు, ఉప సర్పంచ్‌ కావల్‌ రెడ్డి రంగారెడ్డి తండ్రి కావల్‌ రెడ్డి వెంకట సుబ్బారెడ్డి ఈ నెల 26న మృతిచెందారు. ఈ సమాచారం అందుకొన్న రాష్ట్ర వ్యవసా య శాఖ మంత్రి కాకాణి గోవర్ధ న్‌ రెడ్డి ఆదివారం వెంకట సు బ్బారెడ్డి భౌతికఖాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. వెంకట సుబ్బారెడ్డి మతి పట్ల మంత్రి గోవర్ధన్‌ రెడ్డి విచారం వెలిబుచ్చారు. కుటుంబ స భ్యులకు తన ప్రగాఢ సాను భూతి తెలిపారు. కార్యక్రమంలో నివాళి అర్పించినవారిలో వైసిపి రాష్ట్ర కార్యదర్శి, నెల్లూరు జిల్లా విజయ డెయిరీ మాజీ చ్కెర్మన్‌ చిల్ల కూరు సుధీర్‌ రెడ్డి, జిల్లా గ్రీవెన్‌ సెల్‌ అధ్యక్షుడు తలమంచి సు రేంద్రబాబు, మండల కన్వీనర్‌ ఉప్పల శంకరయ్య గౌడ్‌, తోట పల్లిగూడూరు సొసైటీ చైర్పర్సన్‌ కావల్‌ రెడ్డి హరిచంద్రా రెడ్డి, మాజీ జెడ్‌పిటిసి రవీంద్రా రెడ్డి, వైసిపి నాయకులు కోడూరు ది లీప్‌ కుమార్‌ రెడ్డి, కావల్‌ రెడ్డి సురేంద్ర రెడ్డి, నరేంద్ర రెడ్డి, టీ డీపీ, బీజేపీ నాయకులు, చిం తోపు సర్పంచి మల్లికార్జున్‌, న రుకూరు మాజీ సర్పంచ్‌ ఆకు ల మధు, తిరవళ్ళూరు ఈశ్వ రయ్య తదితరులు ఉన్నారు.