Feb 24,2023 23:49

ఏర్పాట్లు పరిశీలిస్తున్న సిఐ, ఎస్‌ఐ

ప్రజాశక్తి-నక్కపల్లి:ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన ఉపమాక వేంకటేశ్వరస్వామి వార్షిక కల్యాణోత్సవాలు మార్చి 2 నుండి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు చేపడుతున్న ఏర్పాట్లను శుక్రవారం సీఐ వి.నారాయణరావు, ఎస్‌ఐ శిరీష పరిశీలించారు. కొండపైకి వెళ్లే మెట్ల మార్గాన్ని పరిశీలించారు. భక్తుల తొక్కిసలాట లేకుండా రెయిలింగ్‌ ఏర్పాటు చేయాలని ఆలయ అధికారులకు సూచించారు. ఆలయంలో స్వామివారిని దర్శించుకునేటప్పుడు ప్రధాన రాజగోపురం పరిసరాల నుంచి పటిష్టమైన క్యూ లైన్లు నిర్మించాలన్నారు. 3వ తేదీ కల్యాణోత్సవం జరుగుతుందని, ఈ దృష్ట్యా నక్కపల్లి నుంచి ఉపమాక వరకూ వున్న రహదారిపై భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్‌ఐ శిరీషకు సూచించారు. ఉత్సవాలకు సంబంధించి బందోబస్తు ఏర్పాట్లపై చర్చించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది రమణ, రాజు పాల్గొన్నారు.