Sep 18,2023 00:44

కావడి ఉత్సవం నిర్వహిస్తున్న అర్చకులు

ప్రజాశక్తి -నక్కపల్లి:ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన ఉపమాక వెంకన్న ఆలయంలో ఆదివారం స్వామివారి బ్రహ్మౌత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రధాన అర్చకులు ప్రసాద్‌ ఆచార్య ఆధ్వర్యంలో ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల ప్రారంభ సూచికగా మాఢవీధులలో కావడి ఊరేగింపు ఉత్సవం జరిగింది. భక్తులు పసుపు, కుంకుమలు, కొబ్బరి బొండాలను సమర్పించారు. ఆలయ ప్రధాన అర్చకులు ప్రసాదాచార్యులు మాట్లాడుతూ, దాతలు, భక్తుల భాగస్వామ్యంతో ఈనెల 26వ తేదీ వరకు బ్రహ్మౌత్సవాలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. 18 సోమవారం ధ్వజారోహణం, 23న వసంతోత్సవం, 25న మృగవేట, ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయన్నారు. 26న పూర్ణాహుతి, వినోదోత్సవం, కంకణ విసర్జన, చూర్ణోత్సం వంటి పూజ కార్యక్రమాలు జరుగుతాయని , ఉత్సవాల్లో భాగంగా పగలు ,రాత్రి సమయాలలో స్వామివారి తిరువీధి సేవలు నిర్వహించనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అర్చకులు సంకర్షణపల్లి కృష్ణమాచార్యులు, పీసపాటి శేషాచార్యులు, భాగవతం సాయి గోపాలాచార్యులు, నండూరి రాజ గోపాలాచార్యులు, ఉపాధ్యాయులు దవరసింగి సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.