Sep 15,2023 00:46

ప్రజాశక్తి - భట్టిప్రోలు
గ్రామంలో మురుగునీటి కారణంగా దోమలు వృద్ధి చెంది డెంగి వ్యాధికి కారణమయ్యాయి. మురుగు నిలవ ప్రాంతంలో ఓ డెంగ్యూ జ్వరం కేసు వెలుగులకు రావడంతో పంచాయతీ, వైద్య సిబ్బంది అప్రమత్తమయ్యారు. గ్రామంలో దోమల నివారణకు పాగింగ్ చేపట్టారు. ఎనిమిదవ వార్డులో రోజుల తరబడి మురుగునీరు గృహాలు చుట్టుముట్టి దోమల బెడదకు ఇళ్లు వదిలి వెళ్ళిన ఘటనలు ఉన్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాలతో పంచాయతీ అధికారులు కదిలారు. గత రెండు రోజుల క్రితం మురుగునీటిపారుదలకు చర్యలు చేపట్టగా గురువారం దోమల నివారణకు అవసరమైన మందులు చల్లించారు. సర్పంచ్ ద్వారా రవికిరణ్మయి రాత్రి సమయంలో కూడా సిబ్బందితో బైటెక్స్ ఫాగింగ్ నిర్వహించారు. వైద్య సిబ్బంది ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఉచితంగా మందులు  అందజేశారు.