Oct 10,2023 23:09

ప్రజాశక్తి-గుడివాడ: స్టేట్‌ బార్‌ కౌన్సిల్‌ న్యాయవాదులను సంప్రదించకుండా ఏకపక్షంగా ప్రవేశపెట్టిన రూ. 20 రూపాయల వెల్ఫేర్‌ స్టాంపు విధానానికి వ్యతిరేకంగా స్థానిక బార్‌ అసోసియేషన్‌ సభ్యులు విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం ఏలూరురోడ్లలోని కోర్టు సముదాయల వద్ద బార్‌ అసోసియేషన్‌ అధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా అసోసియేషన్‌ కార్యదర్శి చెన్నూరు వెంకటరమణ మాట్లాడుతూ స్టేట్‌ బార్‌ కౌన్సిల్‌ ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా న్యాయవాదులకు భారంగా ఉండే 20 రూపాయల వెల్ఫేర్‌ స్టాంపు విధానాన్ని ప్రవేశపెట్టడం దారుణమన్నారు. స్టేట్‌ బార్‌ కౌన్సిల్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అక్టోబర్‌ 10వ తేదీ నుండి 20వ తేదీ వరకు పది రోజులపాటు న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గుడివాడ బార్‌ సోసియేషన్‌ సభ్యులు షేక్‌ మొహమ్మద్‌ రఫీ, వై.రవీంద్రనాథ్‌, చోరగుడి కుటుంబరావు, చేట్టుబాదుల సుర్యారావు, దాసరి సుధాకర్‌, కంభంపాటి రవి, మహిళా న్యాయవాదులు నాగమణి, విమల పాల్గొన్నారు.