Oct 26,2023 00:06

ప్రజాశక్తి - భట్టిప్రోలు
మండలంలోని వెల్లటూరు గ్రామంలో లాక్ సెంటర్లో గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏకలవ్య విగ్రహాన్ని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మెరుగ నాగార్జున బుధవారం ఆవిష్కరించారు. సభకు సర్పంచ్ చౌటూరి లక్ష్మి అధ్యక్షత వహించారు. సభలో మంత్రి నాగార్జున మాట్లాడుతూ తన స్వగ్రామమైన వెల్లటూరులో ఏకలవ్య విగ్రహం ఏర్పాటు చేయడం గర్వ కారణం అన్నారు. విగ్రహం ఏర్పాటు చేసిన  కమిటీ సభ్యులను మంత్రి అభినందించారు. కార్యక్రమంలో బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ దేవినేని మల్లికార్జునరావు, ఎంపీపీ డివి లలిత కుమారి, నాయకులు జి సునీల్, ఏకలవ్య కమిటీ సభ్యులు ఉన్నారు.