ప్రజాశక్తి- సంతమాగులూరు: అన్ని వర్గాల ప్రజానీకం సమస్యలను పరిష్కరించేందుకే గడప గడపకూ మన ప్రభు త్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని రాష్ట్ర శాప్ నెట్ కార్పొరేషన్ చైర్మన్, వైసిపి అద్దంకి నియోజకవర్గం వైసీపీ పార్టీ ఇన్‌చార్జి బాచిన కష్ణ చైతన్య తెలిపారు. సోమవారం మండలంలోని వెలలచెరువు గ్రామంలో మొదటి రోజుగా గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో గడప గడపకూ తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు గురించి ఆరా తీశారు. గ్రామంలో సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల పనితీరును ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చైతన్య మాట్లాడుతూ, పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కారం చేసేందుకు తనవంతుగా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమానికి ముందుగా గ్రామ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా గొడుగులతో గడప గడపకూ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పిటిసి అడవి శ్రీనివాసరావు, వైసీపీ పార్టీ మండల కన్వీనర్ చింతా రామారావు, నాయకులు ఓరుగంటి కోటిరెడ్డి, నాగబోతు రామాంజనేయులు, అట్లా పెద్ద వెంకటరెడ్డి, దుద్దేల గాలెయ్య, మోదేపల్లి శ్రీనివాసరావు, పలువురు సర్పంచులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.










