
లక్కిరెడ్డిపల్లి : రైతుల సంక్షేమాన్ని దష్టిలో ఉంచుకొని వెలిగల్లు నుంచి సాగునీరు విడుదల చేశామని కలెక్టర్ గిరీష పేర్కొన్నారు. సోమవారం లక్కిరెడ్డిపల్లి మండలం, కాలాడివాండ్లపల్లెలో వెలిగల్లు ప్రాజెక్టు కుడి కాలువ నుంచి ఆఫ్‌టెక్‌వాల్ ద్వారా కలెక్టర్, ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి సాగు, తాగునీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లక్కిరెడ్డిపల్లి ప్రాంత రైతులు, ప్రజల కోరిక మేరకు వెలిగల్లు ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేశామన్నారు. మూడు నెలల పాటు వెలిగల్లు ప్రాజెక్టు నుంచి టిఎంసి నీరు విడుదల చేస్తామన్నారు. రైతులందరూ నీరు వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలన్నారు. లక్కిరెడ్డిపల్లి ప్రాంతంలో ఎక్కువగా వరి, వేరుశనగ, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న, టమోటా వంటి పంటలు పండించడం వల్ల ఈ ప్రాంత రైతుల కొరకు వెలిగల్లు కుడికాలువ నుంచి బొంతిరాళ్లకుంట, దిన్నేపాడు, కోమిటి వాండ్లచెరువులకు సంబంధించి టిఎంసి నీరు విడుదల చేశామన్నారు. ఈ ప్రాంతంలోని రైతులందరూ వివిధ పంటలు సాగు చేసుకుని అభివద్ధి చెందాలన్నారు. ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి ఎనలేని కషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గడికోట మోహన్‌రెడ్డి, ఎంపిపి సుదర్శన్‌రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ విశ్వనాథరెడ్డి, ఇరిగేషన్ ఎస్‌ఇ శ్రీనివాసులు, ఇఇ శ్రీనివాసులురెడ్డి, డిఇలు శిరీష్ కుమార్, ప్రతాప్, ఎఇ పావని, జడ్‌పిటిసి రెడ్డయ్య, సర్పంచులు, ఎంపిటిసి పాల్గొన్నారు.
'ఆదిత్య'లో ఓరియంటేషన్ ప్రోగ్రాం
ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్
ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సర విద్యార్థులకు సోమవారం ఓరియంటేషన్ ప్రోగ్రాం ఘనంగా నిర్వహించారు. కళాశాల యాజమాన్యం విద్యార్థులను, తల్లిదండ్రులను ఆహ్వా నించానారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎస్.రామలింగారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో ఇంజనీరింగ్ విద్యార్థుల ఆవశ్యకతను వివరించారు. చంద్రయాన్-3 లాంచింగ్ విజయంలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించిన శాస్త్రవేత్తలే ప్రముఖ పాత్రను పోషించారని తెలుపుతూ వారిలో చాలామంది సాధారణ ఇంజినీరింగ్ కళాశాలలో చదివిన వారే ఎక్కువగా ఉండటం గమనించ దగ్గ విషయమన్నారు. ప్రిన్సిపల్ డాక్టర్ కె.సతీష్ బాబు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించాలని వివరించారు. డాక్టర్ ఏ విజరు భాస్కర్ నాయుడు హ్యుమానిటీస్ అండ్ బేసిక్ సైన్సెస్ హెచ్ ఓ డి మాట్లాడుతూ జేఎన్టీయూ అనంతపురం క్రొత్తగా విడుదల చేసిన అకాడమిక్ రెగ్యులేషన్స్ గురించి విపులంగా తల్లిదండ్రులకు, విద్యార్థులకు తెలియజేశారు. డాక్టర్ వివిఎన్ భాస్కర్ గారు మెకానికల్ హెచ్‌ఒడి మాట్లాడుతూ ఇంజినీరింగ్ విద్య యొక్క ప్రాముఖ్యత వివిధ ఇంజినీరింగ్ విభాగాలలో ఉన్నటువంటి అప్లికేషన్స్ వివరించారు వివిధ రంగాలలో ఉన్నత స్థాయిలలో స్థిరపడిన ప్రముఖులు వారు ఎంచుకున్న ఇంజనీరింగ్ విభాగాలను గురించి వివరించారు. కార్యక్రమంలో కళాశాల హెచ్‌ఒడిలు, అధ్యాపకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.