Jan 12,2023 22:57

ప్రజాశక్తి-మైలవరం 

సినీ హీరో నందమూరి బాలకష్ణ నటించిన చిత్రం వీరసింహారెడ్డి గురువారం విడుదల సందర్భంగా జి. కొండూరు మండలం వెలగలేరు గ్రామంలో అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కలకలం సష్టించింది. బాలకష్ణ, దివంగత ఎన్టీ రామా రావు, స్థానిక శాసనసభ్యులు వసంతకష్ణ ప్రసాద్‌, ఫొటోలతో ఈ బ్యానర్ను ఏర్పాటు చేశారు. ఇటీవల మైలవరం వైసిపి ఎమ్మెల్యే వసంత అధిష్టానం పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం విదేతమే. ఈ నేపథ్యంలో వెలగలేరు వైసీపీకి చెందిన గ్రామ పార్టీ అధ్యక్షుడు సిహెచ్‌. అజరు.ఈ బ్యానర్ను ఏర్పాటు చేశారు. అభిమానంతో బ్యానర్ను కట్టానని మీడియా కు తెలియజేశారు.