Nov 09,2023 23:32

ప్రజాశక్తి - వేటపాలెం
తారతమ్యం లేకుండా సమాజంలో ప్రతి ఒక్కరు న్యాయం పొందే హక్కు ఉందని చీరాల సీనియర్ సివిల్ జడ్జి ఎం సుధా అన్నారు. స్థానిక సర్వోదయ కాలనీ వద్ద న్యాయ విజ్ఞాన సదస్సు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి ఎం సుధా మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి న్యాయం ఉచితంగా అందించాలనే ధ్యేయంతో న్యాయ విజ్ఞాన సదస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. న్యాయం సహాయం అవసరమైన వాళ్లు నేరుగా న్యాయ సేవాధికార సంస్థ ప్రతినిధులను కలిసి ఉచిత న్యాయం పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో చీరాల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గౌరవ రమేష్ బాబు, న్యాయవాది జికె ఈశ్వరి, జీడిపప్పు యూనియన్ ప్రెసిడెంట్ వి శ్రీనివాసరావు, కార్యదర్శి పద్మనాభుని బద్రీనాథ్, గోలి బాలకృష్ణమూర్తి, చిలంకూరి మనోజ్, చుండూరు సురేష్, మాజేడి సుబ్బారావు, వల్లంపట్ల శ్రీనివాసరావు, పత్తి శరత్, సుభాని పాల్గొన్నారు.