Feb 26,2023 01:09
మెగా వైద్య శిబిరంలో పాల్గొన్న వైద్యులు

ప్రజాశక్తి-వేటపాలెం: మండలంలోని రామన్నపేట గ్రామంలో మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల నందు వేటపాలెం జడ్పీటీసీ శ్రీమతి బండ్ల తిరుమలాదేవి విద్యా కమిటీ చైర్మన్‌ గుత్తి దేవకి నందనరావు ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్‌ క్యాంప్‌ లినెక్స్ట్‌ జనరేషన్‌ ఆఫ్‌ ఆర్గనైజేషన్‌ స్వచ్ఛంద సేవా సంస్థ వారు శనివారం మెడికల్‌ క్యాంప్‌ను నిర్వహించారు. ముందుగా వేటపాలెం ఎంఈఓ జెవి సుబ్బయ్య కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. డాక్టర్‌ ఆర్థోపెడిక్‌ సర్జన్‌ డాక్టర్‌ సాంబశివరావు ఎండి జనరల్‌ ఫిజీషియన్‌ డాక్టర్‌ ఎస్‌కె నాగూర్‌ బాబు ఎమర్జెన్సీ క్రిటికల్‌ కేర్‌ కంటి వైద్యుని నిపుణులు డాక్టర్‌ నాగరాజు రోగులను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. జనరల్‌ వైద్యం నిమిత్తం 240 మంది కీళ్లనొప్పులు, బీపీ, షుగర్‌ పేషెంట్స్‌ 120 మంది స్కూలు విద్యార్థులు 70 మంది కళ్లజోళ్లు, 83 మందికి, కంటి ఆపరేషన్‌ 10 మందికి నిర్ణయించడం జరిగిన శిబిరానికి వచ్చిన ప్రతి పేషెంట్‌కు సంస్థ ద్వారా ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అదే విధంగా ఆపరేషన్‌ ఉచితంగా చేస్తామని సంస్థ వారు తెలియజేశారు. వైద్యశాలకు వచ్చే పేషెంట్‌ యొక్క ఖర్చులు మొత్తం తామే భరిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్‌ హెచ్‌ఎం కర్ణ వీరప్రసాద్‌, కోడె రంగారావు, గాంధీజీ, స్కూల్‌ కమిటీ చైర్మన్‌ గుత్తి దేవకినందన్‌రావు గారు దగ్గరుండి మెడికల్‌ క్యాంపునకు సహాయ సహకారాలు అందించారు. వేటపాలెం ఎంఈఒం, జెడ్పిటిసి బండ్ల తిరుమలా దేవి, బాపట్ల జిల్లా సంక్షేమ సంఘం, దేవల మనో బ్రహ్మ దేవంగా సంక్షేమ సంఘం పెద్దలు సత్రం మల్లేశ్వరరావు, గుత్తి విశ్వేశ్వరరావు, కర్ణ లక్ష రావు, బట్ట మోహన్‌రావు, కుర్మా రాహుల్‌, బండ్ల బాబు యారాసు అరుణ్‌బాబు, బండ్ల శరత్‌బాబు, బుసం శ్రీనివాసరావు, మాచర్ల బ్రహ్మం, గుంటూరు బ్రహ్మం, చల్లా విజరు, వార్డు మెంబర్‌ బులసల రామలక్ష్మి, బండ్ల విజయ, గుమ్మడి సుశీల పాల్గొన్నారు.