Oct 03,2023 00:48

ప్రజాశక్తి - అద్దంకి
సమగ్ర శిక్షణ కేజీబీవీలో పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, సమగ్ర శిక్షణ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సభ్యులు ఎం రమేష్, టి శ్రీనివాసరావు  అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా పట్టణంలోని గాంధీజీ విగ్రహానికి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జేఏసీ ఆధ్వర్యంలో అందజేశారు. సమగ్ర శిక్షణ కేజీబీవీ ఓపెన్ చేస్తున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్, పార్ట్ టైం ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలలో ఉద్యోగులు రెగ్యులర్ చేసిందని అన్నారు. మినిమం ఆఫ్ టైం స్కేల్ అమలు చేసి వేతనాలు పెంచారని కోరారు. కానీ ఆరు సంవత్సరాల నుండి సమగ్ర శిక్షణలో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనాలు పెంచలేదని అన్నారు. నెలలు తరబడి వేతనాలు పెండింగులో ఉన్నాయని అన్నారు. ఎంటిఎస్ కోసం ఇచ్చిన జీవోలు అమలు చేయలేదని అన్నారు. రవాణా చార్జీలు, పని భారంతో ఉద్యోగులు అల్లాడిపోతున్నారని అన్నారు. అధికారులకు ఎన్ని వినతులు చేసినా ఫలితంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలని, వడ్డీ లేని బ్యాంకు రుణాలు ఇవ్వాలని కోరారు. మరణించిన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. కారుణ్య నియామకాలు చేపట్టాలని అన్నారు. మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ సెలవులు మంజూరు చేయాలన్నారు. ప్రతినెలా ఒకటో తేదీకి వేతనాలు చెల్లించాలని కోరారు. వేతనాల కోసం సంవత్సరానికి సరిపడా బడ్జెట్ ఒకేసారి విడుదల చేయాలన్నారు. కార్యక్రమంలో హరికృష్ణ, ఎన్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.