Oct 11,2023 21:37

ఖాళీ కుర్చీకి వినతిపత్రం ఇస్తున్న నాయకులు

ప్రజాశక్తి- చిలమత్తూరు : పంచాయతీ పారిశుధ్యకార్మికులు,స్వచ్చభారత్‌ కార్మికులకు పెండింగ్‌లో ఉన్న 10 నెలల వేతనాలు చెల్లించమంటే తొలిగిస్తామని కొంత మంది సర్పంచులు, కార్యదర్శులు బెదిరించడం సరికాదని ఎపి పంచాయతీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్‌ అన్నారు. ఈ మేరకు సంబందిత కార్యదర్శిలపై చర్యలు తీసుకోవడంతో పాటు పెండింగ్‌ వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. తమ డిమాండ్లతోకూడిన వినతిపత్రాన్ని స్థానిక ఎంపిడిఒకు సమర్పించేందుకు రాగా అధికారి అందుబాటులో లేకపోవడంతో ఖాలీ కుర్చీకి వినతిపత్రం అందజేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు వెంకటేష్‌, రామచంద్ర, లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.