Mar 18,2023 23:29

మోకాళ్లపై నిరసన తెలుపుతున్న స్టీల్‌ప్లాంట్‌ కార్మికులు

ప్రజాశక్తి-ఉక్కునగరం : స్టీల్‌ప్లాంట్‌ కార్మికులకు వేతన సవరణ చేయాలని డిమాండ్‌తో ఉక్కు ఉద్యోగులు మోకాళ్లపై నిరసన చేపట్టారు. కూర్మన్నపాలెం నుంచి స్టీల్‌ ప్లాంట్‌ ప్రధాన ద్వారానికి వెళ్లే రహదారిలో ప్లకార్డులతో నిరసన తెలిపారు. గత ఏడాది ఎన్‌జెసిఎస్‌లో వేతన ఒప్పందం జరిగినప్పటికీ ఇప్పటివరకు కార్మికులకు వేతన సవరణ చేయకపోవడం దారుణం అన్నారు. ఈ కార్యక్రమంలో యువ ఉద్యోగులతో పాటు పలు విభాగాలకు చెందిన సీనియర్‌ ఉద్యోగులు సైతం పాల్గొన్నారు. స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణతో పాటు వేతన సవరణ వెంటనే చేయాలని డిమాండ్‌ చేశారు.