కడప అర్బన్ : బ్యాంకుల్లో లాగా, ఇతర సంస్థల్లో లాగా 30 శాతం ఫ్యామిలీ పెన్షన్ చెల్లించాలని, కొత్త పెన్షన్ స్కీంలో 14 శాతం యాజ మాన్యం వాటా చెల్లిం చాలని, వేతన సవరణ చర్చలు తక్షణం ప్రారంభించాలని ఎల్‌ఐసి ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి రఘునాథరెడ్డి, అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి చంద్రపాల్, పెన్షనర్ల సంఘం ప్రధాన కార్యదర్శి సుధీకర్ డిమాండ్ చేశారు. మంగళవారం ఎల్‌ఐసి డివిజనల్ కార్యాలయం ఎదుట యూనియన్ అధ్యక్షులు అవధానం శ్రీనివాస్ సమన్వయంలో ఎల్‌ఐసి సంఘాల దేశవ్యాప్త సంయుక్త కార్యాచరణ పిలుపుమేరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఫ్యామిలీ పెన్షన్ 30 శాతానికి పెంచాలని ఎల్‌ఐసి 2019లోనే కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసినా, ఇంతవరకు కేంద్ర ప్రభుత్వ ఆమోదం లేదని వాపోయారు. కేంద్ర ప్రభుత్వంలో, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 2010 తర్వాత చేరిన వారందరికీ నూతన పెన్షన్ స్కీంలో 14 శాతం 'యాజమాన్య పిఎఫ్ వాటా' చెల్లిస్తున్నారని, ఎల్‌ఐసిలో ఇప్పటికీ అది 10 శాతమే అన్నారు. 2022, నవంబర్ నుంచి బ్యాంకుల్లో వేతన సవరణ బకాయి పడితే, ఇప్పటికే చర్చలు మొదలయ్యాయని, ఎల్‌ఐసి ఃలో ఇంతవరకు ఆ ఊసే లేదని అన్నారు. ఇలా ప్రతి చిన్నా, పెద్దా సమస్య పరిష్కారంలో కేంద్ర ప్రభుత్వం, ఆర్థిక మంత్రిత్వ శాఖ బీమా ఉద్యోగుల పట్ల వివక్ష చూపుతోందన్నారు. ఇదే ధోరణి కొనసాగితే, రాబోయే రోజుల్లో ఐక్య ఆందోళనలు ఉధతం చేస్తామని వారు హెచ్చరించారు. నిరసన కార్యక్రమంలో యూనియన్ల నేతలు ఎల్లారెడ్డి, మహేశ్వర్ రెడ్డి, పద్మజ, అక్బర్, రాజు, వారిజాతమ్మ , పర్వీన్, కుమార్, శ్రీకష్ణ, వసుప్రద, కస్తూరి పాల్గొన్నారు.










