Nov 23,2022 23:47

స్టీల్‌ప్లాంట్‌ ​​​​​​​సిఐటియు ప్రధాన కార్యదర్శి వైటి దాస్‌

స్టీల్‌ప్లాంట్‌ సిఐటియు ప్రధాన కార్యదర్శి వైటి దాస్‌
ప్రజాశక్తి-ఉక్కునగరం
: స్టీల్‌ప్లాంట్‌ కార్మికులు, ఉద్యోగులకు వేతనం ఒప్పందం వెంటనే అమలు చేయాలని సిఐటియు ప్రధాన కార్యదర్శి వైటి దాసు డిమాండ్‌ చేశారు. బుధవారం ఉక్కు నగరం సిఐటియు కార్యాలయంలో ఎస్‌ఎంఎస్‌-2 మహాసభలో మాట్లాడుతూ గత అక్టోబర్‌లో ఎన్‌జెసిఎస్‌ సమావేశంలో క్లాజ్‌- 8 కారణంగా విశాఖ ఉక్కులో నూతన వేతనాలు అమలు కాకుండా ప్రస్తుత గుర్తింపు యూనియన్‌ అడ్డుపడిందన్నారు. ఫలితంగా సెయిల్‌లో నూతన ఒప్పందంతో ఇప్పటికే కార్మికులు కొత్త వేతనాలు పొందుతున్నా, విశాఖ ఉక్కులో అమలు జరగలేదన్నారు. డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ బి.అప్పారావు మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిరక్షణకు 650 రోజులుగా కార్మికుల ఆందోళన చేస్తున్నా కేంద్రంలో కదలిక లేదని, రాష్ట్రంలోని 25మంది ఎంపిలు రాజీనామా చేసి కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. కార్యక్రమంలో యు.రామస్వామి, బి తౌడన్న, యు మరిడయ్య ,పూర్ణచంద్ర పాల్గొన్నారు. అనంతరం.ఇ. శ్రీనివాసరాజు డాంబికరావు, బి.అప్పలరాజు, జిసిహెచ్‌.చినఅప్పారావు, ఉదయభాస్కర్‌, కొండలరావు, మరో 80 మందితో నూతన కమిటీని ఎన్నుకున్నారు.