ప్రజాశక్తి-ఉక్కునగరం : ఎన్‌జెసిఎస్ మాదిరిగా 2017 వేతన సవరణ ఒప్పందం విశాఖ ఉక్కులో కూడా అమలుచేయాలని కోరుతూ యాజమాన్యంతో ఈ నెల 14న అన్ని యూనియన్ల నేతలు చర్చించనున్నట్లు అఖిలపక్ష కార్మిక సంఘాల నేతలు తెలిపారు. విశాఖ ఉక్కు అఖిలపక్ష కార్మిక సంఘాల సమావేశం సోమవారం ఎఐటియుసి ఆఫీస్‌లో నిర్వహించారు. 2017 వేతన సవరణ జరిగి 13 నెలలైనా విశాఖ ఉక్కులో అమలు జరగపోవడంపై ఈ సమావేశంలో చర్చించారు. అనంతరం హాజరైన అఖిలపక్ష కార్మిక సంఘ నాయకుల అభిప్రాయం మేరకు ఈ నెల 14న అన్ని యూనియన్లు వేతన సవరణ అమలు ఒప్పందంపై చివరిగా యాజామాన్యాన్ని కలిసి వారి వైఖరి తెలుసుకుని తరువాత ప్రత్యక్ష పోరాటానికి సిద్ధపడాలని తీర్మానం చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు కెఎస్‌ఎన్.రావు, జె.రామకృష్ణ, ఎ.మసేనురావు, కె.రాజబాబు, నీరుకొండ రామచంద్రరావు, కారు రమణ, యు.రామస్వామి, వైటి.దాస్, గణపతిరెడ్డి, డి.అప్పారావు, కొమ్మినేని శ్రీనివాస రావు, జిఆర్‌కె.నాయుడు, వై.మస్తానప్ప, వై.రమణ, విళ్లా రామ్మోహన్ కుమార్, మణి, బొడ్డు పైడిరాజు, కరణం సత్యారావు, పి.జయ, పరంధామయ్య, జగ్గారావు, జగదీష్, మహాలక్ష్మినాయుడు, కె.శ్రీనివాసనాయుడు, కె.ప్రకాష్, శ్రీనివాస్, బి.డెవిడ్, హెచ్.సన్యాసిరావు, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.










