Dec 07,2022 00:02

వినతి పత్రం అందిస్తున్న సిపిఎం నేతలు

ప్రజాశక్తి -మాడుగుల గ్రామపంచాయతీలలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న కార్మికులకు వేతనాలు తక్షణం చెల్లించాలని గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి నరసింహమూర్తి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకురాలు భవాని డిమాండ్‌ చేశారు. కొద్దికాలంగా సిబ్బందికి వేతనాలు ప్రభుత్వం చెల్లించక పోవడంపై మంగళవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. వేతనాలు చెల్లించకపోవడంతో పారిశుద్ధ కార్మికులు ఆకలితో జీవితాలు వెళ్లదీస్తున్నారని అన్నారు. ప్రతినెల 10వ తేదీ లోపు వేతనాలు చెల్లించాలని, 21 శాతం జీతాలు పెంచి, అవసరమైన పనిముట్లు అందజేయాలని తెలిపారు. ఎంపీడీవో మీనా కుమారికి వినతి పత్రం అందించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్మికుల సంఘం అధ్యక్షులు అచ్చిబాబు, కార్యదర్శి ఈశ్వరరావు, అప్పారావు కామరాజు, నరసింగరావు పాల్గొన్నారు.