ప్రజాశక్తి-విఆర్.పురం
పాఠశాలల శానిటేషన్ వర్కర్లకు 4 నెలలుగా చెల్లించాల్సిన వేతన బకాయిలు ఇవ్వాలని కోరుతూ శనివారం భోగి పండుగను పురస్కరించుకొని రేఖపల్లిలోని స్థానిక యంఆర్‌సి కార్యాలయం వద్ద శానిటేజర్ వర్కర్లు ఆందోళన చేపట్టారు. తమకు వెంటనే పెండింగ్ వేతనాలు ఇవ్వాలని, వేతనాలు పెంచాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పాఠశాల శానిటేజర్ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షలు కారం రంగమ్మ, కార్యాదర్శి సోడి వరలక్ష్మి మాట్లడుతూ రాష్ట్రమంతా అందరూ ఉద్యోగులూ భోగి పండుగ సంక్రంతి సంతోషంగా జరుపుకుంటే మాకు అటువంటి సరదాలు కూడా లేక ఇలా కార్యాలయం ముందు ఆందోళన చేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు రాక పండుగ పూట పస్తులు ఉండే దుస్థితి దాపురించిందన్నారు. ఇప్పటికైన ప్రభుత్వం వెంటనే వేతనాలు విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కారం నాగమ్మ, నాగుల కమల, సున్నం వెంకమ్మ, కోర్స లాలమ్మ, శీలం వెంకమ్మ తదితరులు పాల్గొన్నారు.










