Jul 11,2023 21:29

కమిషనర్‌కు వినతిని అందజేస్తున్న క్లాప్‌ వాహనాల డ్రైవర్లు

పార్వతీపురంటౌన్‌: తమకు బకాయి పడ్డ రెండు నెలల వేతనాలను చెల్లించాలని క్లాప్‌ ఆటో డ్రైవర్లు మున్సిపల్‌ కమిషనర్‌ జె.రామఅప్పల నాయుడును కోరారు. మంగళవారం క్లాప్‌ వాహనాల డ్రైవర్లు సిఐటియు జిల్లా అధ్యక్షులు డి.రమణారావు, కోశాధికారి గొర్లి వెకటరమణతో కలిసి కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్‌తో వారు మాట్లాడుతూ, రెండు నెలలుగా బకాయి పడ్డ వేతనాలను చెల్లించాలని, జీవో 7 ప్రకారం అమలు చేసిన కనీస వేతనం రూ.18,500 చెల్లించాలని, కార్మికులందరికీ పిఎఫ్‌, ఇఎస్‌ఐ సమస్యలు పరిష్కరించాలని, పిఎఫ్‌ స్లీప్‌లు ఇవ్వాలని, వాహనాల మరమ్మతుల ఖర్చులు రెగ్యులర్‌గా విడుదల చేయాలని లేనిచో భవిష్యత్తు ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో డ్రైవర్లు ఎన్‌.త్రినాథ, ఎన్‌. అప్పలరాజు, ఎస్‌. సాయికుమార్‌, బి. సతీష్‌ ధావన్‌ వి. జయ, రాజశేఖర్‌ ఎం. మధు, ఆర్‌.మురళీకృష్ణ, బి.సాయి, జి.చంటి, ఎస్‌. పవన్‌ కుమార్‌, తదితరులు పాల్గొన్నారు..