
ప్రజాశక్తి - రేపల్లె
వేట సమయంలో మత్య్సకారులు అప్రమత్తంగా ఉండాలని రాజుకాల్వ సాగరమిత్ర బి నాగరాజు అన్నారు. మండలంలోని రాజుకాల్వ సచివాలయం పరిధిలో మత్స్య సాగుబడి గురువారం నిర్వహించారు. ఎప్పటికప్పుడు వాతావరణ సూచికలను పాటిస్తూ వేటను కొనసాగించాలని చెప్పారు. బలపడిన వాయుగుండం కారణంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడినట్లు ఐఎండి వెల్లడించిందని తెలిపారు. విశాఖ, పరదీప్ (ఒడిశా)కు 380కెఎం దూరంలో కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం గంటకు 18కెఎం వేగంతో వాయవ్య దిశగా కదులుతోందని తెలిపారు. ఎల్లుండి ఉదయం బంగ్లాదేశ్ వద్ద తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, ఒడిశాలో భారీ వర్షాలు పడతాయని తెలిపారు. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. పోస్ట్ బోట్లు రిజిస్ట్రేషన్, చేపలు పట్టడం లైసెన్స్‌లకు సంబంధించిన అధికారిని అడిగి సేవలను ఉపయోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో లంకెవానిదిబ్బ సాగర్ మిత్ర కుమార్ పాల్గొన్నారు.