ప్రజాశక్తి - రెంటచింతల: వర్షాకాలమైనా వర్షాలు లేకపోవడంతోపాటు వాతావరణం మండు వేసవిని తలపిస్తోంది. రోజురోజుకూ ఎండ తీవ్రత పెరుగుతూ అత్యధిక పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పల్నాడు జిల్లాలోని మండల కేంద్రమైన రెంటచింతలలో ఆదివారం పగటి ఉష్ణోగ్రత 37.5 డిగ్రీలు నమోదైంది. ఆగస్టులో మండలంలో సాధారణ వర్షపాతం 100 మిల్లీమీటర్లు కాగా ఇప్పటివరకు కేవలం 35.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. గతేడాది ఆగస్టులో 138 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.










