వేసవిలో జాగ్రత్తలు పాటిద్దాం.. ఆరోగ్యాన్ని కాపాడుకుందాం- బ్రహ్మానందచారి
ప్రజాశక్తి - బనగానపల్లె
వేసవిలో జాగ్రత్తలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అని జెకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షులు జెఎస్ఎస్ బ్రహ్మానందచారి పేర్కొన్నారు. గురువారం మండలం లోని పలుకూరు గ్రామంలోని రామాలయం లో శ్రీ జె కె ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జే ఎస్ ఎస్ బ్రహ్మాండచారి ఆధ్వర్యంలో వేసవిలో తల్లిదండ్రులకు విజ్ఞప్తి కరపత్రం విడుదల చేశారు.వేసవి జాగ్రత్తలపై పిల్లల పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన సదస్సుఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో బ్రహ్మాండచారి మాట్లాడుతూవేసవిలో తగిన జాగ్రత్తలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. వేసవి సెలవులు వస్తే చిన్నపిల్లలు నీటి గుంటలు ,చెరువులు, గని గుంతలు, వాగుల్లో ఈతకు పంపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని లేకపోతే ప్రమాదాలు జరుగుతాయని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. అత్యవసరం అయితే తప్ప ఎండకు రావద్దని తెలిపారు.. ఇంటి వద్ద ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలిపారు. ఎక్కువ మంచినీరు తాగాలని ,తెల్లని దుస్తులు ధరించాలని వడదెబ్బ కు సంబంధించిన నివారణ నివారణ చర్యలను వివరించారు.ఈ కార్యక్రమంలో బాల హనుమంతు, వెంకటస్వామి, లక్ష్మీనారాయణ, భాష, సుబ్బరాయుడు మొదలగు వారు పాల్గొన్నారు










