ప్రజాశక్తి - భీమడోలు
జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు 40 రోజుల పాటు నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరం సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎం.శేఖర్‌బాబు కోరారు. మంగళవారం ఆయన భీమడోలు శాఖా గ్రంథాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. అనంతరం భీమడోలు శాఖ గ్రంథాలయంలో గ్రంథ పాలకులు కె.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరం కార్యక్రమ ప్రగతిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న విద్యార్థులతో మమేకమయ్యా రు. వారు నేర్చుకుంటున్న, నేర్చుకోవాలనుకున్న అంశాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమం మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు వారి సలహాలు, సూచనలు కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో జిల్లా పరిధిలోని 68 గ్రంథాలయాల్లో వేసవి విజ్ఞాన శిబిరం కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. కార్యక్రమాలకు 2500 మంది వరకు విద్యార్థులు హాజరవుతున్నారన్నారు. ఈ సంఖ్యను మరింత పెంచేందుకు గ్రంథపాలకులు కృషి చేయాలని, ఉపాధ్యాయులు, ప్రముఖులు సహకారం తీసుకోవాలని సూచించారు. విద్యార్థులను విజ్ఞానవంతులుగా చేసేందుకు నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరంలో నీతి కథల బోధన, పుస్తక సమీక్ష వంటి అంశాలకు తోడు యోగా శిక్షణ, చిత్రలేఖనంలో మెలకువలు నేర్పటం, పేపర్ క్రాఫ్ట్ తయారీ వంటి అంశాలను జతచేయాలని కోరారు. గతంలో భీమడోలు శాఖా గ్రంథాలయంలో నిర్వహించిన చదవటం మాకు ఇష్టం కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులను ప్రోత్సహించేందుకు ముందుకు వచ్చిన స్వచ్ఛంద సంస్థ సత్యం ఫౌండేషన్ ఛైర్మన్ బాలనాగ విజయ సారధి సేవలు అభినందనీయమన్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరంలో పాల్గొనే విద్యార్థుల కోసం వేలాది రూపాయల విలువైన ఇన్‌డోర్ క్రీడా సామగ్రి అందించిన విశ్రాంత ఉపాధ్యాయురాలు గుళ్ల నూకరాజును, యోగా ట్రైనర్‌గా వ్యవహరిస్తున్న యూనియన్ బ్యాంక్ అధికారి భావనా రుషి, విద్యార్థులకు ప్రతినిత్యం స్పోకెన్ ఇంగ్లీష్‌పై శిక్షణ ఇస్తున్న సత్యేంద్ర ఇంగ్లీష్ మీడియం పాఠశాల ప్రిన్సిపల్ పివివి.సత్యనారాయణతో పాటు ప్రతినిత్యం గ్రంథాలయంలో నిర్వహిస్తున్న అన్ని కార్యక్రమాలకు రిసోర్స్ పర్సన్‌గా వ్యవహరిస్తున్న సామాజిక కార్యకర్త మండే సుధాకర్లను ఆయన ప్రత్యేకంగా అభినందిం చారు. వారి సేవలను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ఇదే క్రమంలో గుండుగొలను శాఖా గ్రంథ పాలకురాలు జి.నాగమణి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరం కార్యక్రమంలో పాల్గొన్న ద్వారకాతిరుమల మండలం తిరుమలంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యా యులు ఫణి కుమార్ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు సులువైన పద్ధతిలో కష్టమైన లెక్కలు చేయటం, చిత్రలేఖ నం, స్పోకెన్ ఇంగ్లీష్ వంటి అంశాలను వివరించారు.
నిడమర్రు : వేసవి విజ్ఞాన శిబిరంలో భాగంగా నిడమర్రు శాఖా గ్రంథాలయంలో మంగళవారం విద్యార్థులకు చిత్రలేఖనంపై పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 40 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమా న్ని గ్రంథాలయ పాలకులు జి.బాలరాజు పర్యవేక్షించారు.
నూజివీడు రూరల్ : మండలంలోని గొల్లపల్లి గ్రంథాలయంలో మంగళవారం వేసవి విజ్ఞాన శిబిరంలో విద్యార్థులకు గొల్లపల్లి హైస్కూల్ తెలుగు ఉపాధ్యాయులు కె.మోహన్‌రావు పలు విషయాలపై అవగాహన కల్పించారు. పుస్తక పఠనం వల్ల అనేక లాభాలు ఉన్నాయని, విజ్ఞానం మరింత పెరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ ఉపాధ్యాయులు, గ్రంథాలయ అధికారి డొక్కు శ్రీనివాసరావు పాల్గొన్నారు.










