ప్రజాశక్తి - పెద్దాపురం
పెద్దాపురం యాసలపు సూర్యారావు భవనంలో పెద్దాపురం చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వ ర్యంలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణా శిబిరంలో బుధవారం ప్రముఖ ఫొటో గ్రాఫర్‌లు నవీన్ నాని, పవన్, డేవిడ్‌లు విద్యార్థులకు ఫొటోగ్రఫీ, కెమెరాలలో రకాలు, వాటి వినియోగం, ఫోటోలు తీయడంలో మెలకువలు పై విద్యార్థు లకు అవగాహన కల్పించారు. దుంగల పూజిత కరాటేలో శిక్షణ ఇచ్చారు. నీలపాల బాల మురళీకృష్ణ మ్యాథ్స్‌లో అవగాహన కల్పించారు. సంఘ సేవ కుడు అద్దేపల్లి భాస్కరరావు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు విద్యార్థు లందరికీ స్నాక్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో క్యాంపు కో-ఆర్డినేటర్ రొంగల అరుణ్,కూనిరెడ్డి అరుణ, అమత, నమ్రత, మంజుల, పూజిత, ఐశ్వర్య, జ్యోత్స్న, దారపురెడ్డి కృష్ణ, రొంగల వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. పెద్దాపురం శాఖా గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరం లో బుధవారం సామర్లకోట సిబిఎస్‌సి స్కూల్ ఉపాధ్యా యులు దుర్గాప్రసాద్, వానపల్లి లచ్చిబాబులు యోగాస నాలపై విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ యోగాసనాల వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత నెలకొంటుం దన్నారు. వాడపల్లి విమరాణి విద్యార్థులకు దేశభక్తి గీతాలపై శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో గ్రంధాల యాధికారి పాలంకి నాగరాజు, సిబ్బంది, పాఠకులు పాల్గొ న్నారు. కాకినాడ గాంధీనగర్ శాఖ గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరం కార్యక్ర మంలో భాగంగా 24వ రోజు బుధవారం పాఠశాల విద్యార్థులకు సంగీతం మాస్టారు డాక్టర్ చక్రవర్తుల సీతారామయ్య విద్యార్థులకు వందన మమ్మా భారతమా, ఎగురుతోంది ఎగురుతోంది మువ్వన్నెల జెండా అనే పాటలను నేర్పించారు. విద్యార్థులకు సిహెచ్ వాణి కథలు చదవడం, కథలు చెప్ప డంలో శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కాకినాడ గాంధీనగర్ మున్సిపల్ హై స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ జి. దుర్గాప్రసాద్ రెడ్డి స్నాక్స్ అందజేశారు. కార్యక్రమంలో విద్యా కమిటీ సభ్యులు పి. శ్రీనివాసరావు, రిసోర్స్ పర్సన్ పి.వీరబాబు, పద్మావతి, విద్యార్థులు పాల్గొన్నారు.










