ప్రజాశక్తి -యంత్రాంగం వేసవిలో విద్యార్థులకు పలుచోట్ల నిర్వహించిన శిబిరాలు ఆదివారం ఉత్సాహపూరిత వాతావరణంంలో ముగిశాయి. వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. పెద్దాపురం వేసవి విజ్ఞాన శిబిరాలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో చిన్ననాటి నుంచి సామాజిక అంశాలపై అవగాహన పెరుగుతుందని సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షులు డాక్టర్ జోస్యుల కష్ణబాబు అన్నారు. స్థానిక శాఖా గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరం ముగింపు సభలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. గ్రంథాలయాధికారి పాలంకి నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి ఉన్నత చదువుతో పాటు మానవతా విలువలను పెంపొందించవలసిన ఆవశ్యకత ఉందన్నారు. బాలికోన్నత పాఠశాల హెచ్‌ఎం బిజె.రవీంద్ర, నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ హెచ్‌ఎం శ్రీదేవి, గాంధీ మున్సిపల్ స్కూల్ హెచ్‌ఎం శివ జ్యోతి, వినియోగదారుల పోరం అధ్యక్షులు భళ్లమూడి సూర్యనారాయణ మూర్తి, సాహితీ స్రవంతి కార్యదర్శి కొత్త శివ, ఉపాధ్యాయిని వాడపల్లి విమలారాణి మాట్లాడారు. వివిధ పోటీల్లో విజేతలైన భవ్య,దుర్గా సాయి,జోష్య, సత్య తులసి, పద్వి, కావ్య, ఆరుద్ర ప్రియా, హర్షవర్ధన్, రాజేశ్వరి, శ్రావ్య, శ్రీదేవి, దివ్య తేజ, నవీన్, యశ్వంత్, సాయి దుర్గ, ఎం.లక్ష్మి, మాధురిశ్రీ, సాయికుమార్ తదితరులకు బహుమతులు అందజేశారు. ఈ సభలో గ్రంథాలయ సిబ్బంది సింగం బుల్లియ్య,పాఠకులు పాల్గొన్నారు. తునిలో వేసవి శిక్షణా శిబిరాల ముగింపు సందర్భంగా శాఖా గ్రంథాలయంలో విద్యార్థులకు ప్రశంసాపత్రాలను అందించారు. ఈ గ్రంథాలయంలో మే 8వ తేదీ నుంచి జూన్ 11 వరకూ విద్యార్థుల కోసం వేసవి శిక్షణా శిబిరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాల్లో పిల్లలకు శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణా తరగతుల్లో పాల్గొన్న వారికి ప్రశంసాపత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ మాస్టర్ కె.నాగభూషణం, జగన్నాథం మాస్టారు, గ్రంథాలయాధికారి జి.రంగనాథరావు పాల్గొన్నారు. యు.కొత్తపల్లి గ్రంథాలయంలో వేసవిజ్ఞాన శిబిరం ముగింపు సందర్భంగా ఉప్పాడ సర్పంచ్ ఉమ్మిడి మేరీ జాను మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉప్పాడ కార్యదర్శి ఎన్.శ్రీనివాస్, గ్రంథాలయ అధికారి టి.నళిని పాల్గొన్నారు ఏలేశ్వరం గ్రంథాలయంలో నిర్వహించిన వేసవి విజ్ఞాన శిబిరంలో విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి సీనియర్ నేతలు అలమండ చలమయ్య, శిడగం వెంకటేశ్వరరావు, సుంకర రాంబాబు, యుటిఫ్ నాయకులు ఎండి ఇబ్రహీం ఖాన్, తూమురౌతు శ్రీనివాసరావు, గ్రంథాలయ పాలకులు కవికొండ సత్యనారాయణ విజేతలకు బహుమతులు అందజేశారు. పెదపూడి గ్రంథాలయాల నుంచి నెల రోజులుగా విద్యార్థులు వివిధ విభాగాల్లో వేసవి విజ్ఞాన శిక్షణ పూర్తి చేయడం అభినందనీయమని ప్రముఖ న్యాయవాది తిప్పాన జనార్దన్ స్వామి అన్నారు. గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరం ముగింపు కార్యక్రమంలో శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయాధికారి వర్ధన్, సామాజిక ఆరోగ్యకేంద్రం అభివద్ధి కమిటీ మెంబర్ కోరా వీర్రాజు చౌదరి తదితరులు పాల్గొన్నారు. సామర్లకోట రూరల్ వేసవి విజ్ఞాన శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని లబ్ధి పొందాలని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ప్రముఖ గణిత అవధాని తోటకూర సాయి రామకష్ణ అన్నారు. స్థానిక గ్రంథాలయంలో గ్రంథాలయ అధికారి బందిల రత్నమణి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు సర్టిఫికెట్స్, బహుమతులు అందజేశారు.










