ప్రజాశక్తి-గంగాధరనెల్లూరు: కలిగిరి కొండకు వెళ్లి తిరిగి వస్తున్న ట్రాక్టర్ బోల్తా పడి 13మంది గాయాలపాలైన సం ఘటన శనివారం పెనుమూరులో చోటుచేసుకొంది. వివరాలు ఇలా ఉన్నాయి.. శనివారం కావడంతో గంగాధర నెల్లూరు మండలం బట్టుకండ్రిగకు చెందిన గ్రామస్తులు ట్రాక్టర్‌లో పెనుమూరు మండలంలోని కలిగిరికొండ వేంక టేశ్వరస్వామి దర్శనానికి బయలుదేరారు. దర్శన అనం తరం మద్యాహ్నం తిరుగు ప్రయాణంలో కొండ సమీప ంలో ఎదురుగా వస్తున్న కారును తప్పించ బోయిన ట్రాక్టర్ అదుపుతప్పింది. రోడ్డు ఏటవాలుగా ఉండడంతో ట్రాక్టర్ బోల్తాపడింది. ట్రాక్టర్‌లో 30మంది ప్రయాణిస్తుండగా 13 మంది గాయాలపాలైయ్యారు. సంఘటనా స్థలం నుంచి స్థానికులు 108సాయంతో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో ఊపరిపీల్చుకున్నారు. వారికి మెరుగైన చికిత్స కోసం అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. బాధితులను గం గాధరనెల్లూరు తహశీల్దార్ ఇన్భనాధన్, సర్పంచ్ ఏకాం బరం, వీఆర్‌వో ప్రభావతి గాయపడిన వారికి చికిత్స ఏర్పా ట్లను పర్యవేక్షిస్తున్నారు.
క్షత్రగాత్రులకు మెరుగైన వైద్యం అందించండి-డిప్యూటి సిఎం
కార్వేటినగరం:కలిగిరి కొండపై చోటు చేసుకున్న విషాదంపై డిప్యూటీ సీఎం నారాయణస్వామి దిగాబ్రాంతికి గురైయ్యారు. కార్వేటినగరం పర్యటనలో ఉన్న ఆయన ప్రమాద సంఘటన సమాచారం అందుకున్న మంత్రి చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్కు ఫోన్ చేసి క్షత్రగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. ఎలాంటి విషాదం చోటు చేసుకోకుండా చూడాలని సూచించారు.
వేర్వేరు ప్రమాదాల్లో..
ఒకరి మృతి, ఆరుగురికి గాయాలు
ప్రజాశక్తి-చౌడేపల్లి: మండలంలో జరిగిన మూడు వేర్వేరు ప్రమాదాల్లో ఒకరు మృతి చెందారు, పలువురికి గాయా లపాలైయ్యారు. చౌడేపల్లి-పరికిదొన మార్గంలో బైక్‌పై వెలుతున్న నలుగురు యువకులను ట్రాక్టర్ ఢకొీనింది. ధీంతో బైక్‌పై వెలుతున్న యువకుడు శ్రీనివాస్(15) తీవ్రం గా గాయపడ్డాడు. మరో ముగ్గురు రెడెప్ప(14), యూన స్(15), సంతోష్(14)లకు గాయాలైయ్యాయి. స్థానిక ఆరో గ్య కేంద్రానికి వీరిని తరలించగా చికిత్స పొందుతూ శ్రీని వాస్ మృతి చెందాడు. కాగా మిగిలిన ముగ్గురు యువ కులు చికిత్స పొందుతున్నారు. తిరుపతి-చౌడేపల్లి ప్రధాన రహదారిలో సింగిరిగుంట వద్ద జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో బైక్‌ను కారు ఢకొీన్నది. ప్రమాదంలో యువ కుడు రవి(25)కి తలకు, కాలుకి బలమైన గాయాలతో పుం గనూరు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. చౌడేపల్లి-పుంగనూరు ప్రధాన రహదారిలో బిల్లేరు గౌడిండ్ల వద్ద జరిగిన ప్రమాదంలో ఆటోను వెనుక నుంచి ఆర్టిసి ఢకొీన్నది. ఈ ప్రమాదంలో యువకులు సిద్ధిక్(25), సాదిక్(22)లకు గాయాలయ్యాయి. వారిని పుంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు.










