కావాల్సిన పదార్థాలు : ఎండు మిరపకాయలు- ఆరు, జీలకర్ర- చిటికెడు, ధనియాలు- చిటికెడు, వేపపువ్వు- కావాల్సినంత, చింతపండు (నానబెట్టినది)- సరిపడా, వెల్లుల్లి- నాలుగు రెబ్బలు, పసుపు- చిటికెడు, ఉప్పు- సరిపడా, బెల్లం - కొద్దిగా (మీ ఇష్టాన్నిబట్టి)
తయారుచేసే విధానం :
ముందుగా పాన్ పెట్టుకుని నూనె వేసుకోవాలి. అది వేగాక ఎండు మిరపకాయలు, జీలకర్ర, ధనియాలు వేసి వేగించాలి.
తర్వాత వేపపువ్వు వేసి, తక్కువ మంటలో కొద్దిగా వేగించాలి. అందులోనే కొంచెం చింతపండు, వెల్లుల్లి, పసుపు వేసి వేగనివ్వాలి.
అది బాగా చల్లారిన తర్వాత రోట్లో వేసుకుని, కచ్చాపచ్చాగా దంచుకోవాలి. అందులోనే మరికొంచెం చింతపండు, ఉప్పు, బెల్లం సరిపడినంత వేసి, నూరుకోవాలి
తర్వాత పోపుకోసం పాన్‌లో కొంచెం నెయ్యి వేయాలి. మినపప్పు, ఆవాలు వేసి తాలింపు పెట్టుకోవాలి. అందులో రోటిలో దంచుకున్న పచ్చడిని వేయాలి. అంతే వేపపువ్వు రోటి పచ్చడి రెడీ. ఇది రెండు, మూడు రోజులు నిల్వ ఉంటుంది.