కావాల్సిన పదార్థాలు : ఎండిన వేపపువ్వు- అరకప్పు, నూనె-టీ స్పూన్, ఎండు మిరపకాయలు-రెండు, ఆవాలు-ముప్పావు టీస్పూన్, మినపప్పు-సగం టీస్పూన్, ఇంగువ-చిటికెడు, ఉప్పు- రుచికి తగినంత, అన్నం- కప్పు, నెయ్యి- సరిపడా.
తయారుచేసే విధానం :
పాన్‌లో నూనెవేసి, తక్కువ మంటలో వేడిచేయాలి. అందులో ఆవాలు వేసి, అవి చిటపటలాడిన తర్వాత ఎండు మిరపకాయలను వేసి వేగించాలి.
అందులోనే మినపప్పు, వేపపువ్వును వేసి, బంగారు వర్ణం వచ్చే వరకూ వేగి ంచాలి.
అయితే తక్కువ మంటలోనే ఉంచాలి అనేది మరచిపోవద్దు. అవి వేగే వరకూ కలియతిప్పుతూనే ఉండాలి. తర్వాత ఇంగువ వేసి, కలియతిప్పి స్టౌ ఆపేయాలి.
కప్పు అన్నంలో వేగించిన వేపపువ్వు టీస్పూన్ కలపాలి. అందులో రుచికి తగినంత నెయ్యి, ఉప్పు వేసి బాగా కలియతిప్పాలి. ఒక వ్యక్తికి కేవలం కప్పు సరిపోతుంది. వారానికి ఒకసారి ఇలా వేపాకు రైస్ తీసుకుంటే జీర్ణవ్యవస్థ శుభ్రపడుతుంది.