Apr 11,2021 16:52

కావాల్సిన పదార్థాలు : వేపపువ్వు- సరిపడా, మినపప్పు- కప్పు, పచ్చిమిరపకాయల పేస్ట్‌- స్పూన్‌, ఉప్పు- సరిపడా, ఇంగువ- కొద్దిగా, జీలకర్ర- పావు స్పూన్‌.
తయారుచేసే విధానం :
 వేపపువ్వును నీళ్లతో కడిగి, ఆరబెట్టుకోవాలి. కొంతమంది వేపపువ్వును నీడలోనూ ఆరబెడతారు. అది బాగా ఎండిన తర్వాత ఉపయోగించుకోవాలి.
 ముందుగా మినపప్పును నాలుగు గంటలపాటు నీళ్లల్లో నానబెట్టుకోవాలి. దానిని గారెల పిండి కంటే కొంచెం గట్టిగా రుబ్బుకోవాలి.
 ఒక బౌల్‌ తీసుకుని మినప్పిండి, పచ్చిమిరపకాయల పేస్ట్‌, ఉప్పు, ఇంగువ, జీలకర్ర వేసి బాగా కలియతిప్పాలి. అందులోనే వేపపువ్వును వేసి, పిండిలో బాగా కలిసేలా చేయాలి.
 తర్వాత ప్లాస్టిక్‌ కవర్‌ తీసుకుని, దానిమీద వడియాల్లా చిన్నచిన్న ఉండలు పెట్టుకోవాలి. అవి బాగా ఎండిన తర్వాత, వడియాలను అప్పుడప్పుడు నూనెలో వేయించుకుని, తినవచ్చు.
 కొందరు వీటిని ఒరుగుల్లా పెట్టుకుని, అన్నంలో కలుపుకుని తింటారు.
 ఇవి చాలా టేస్ట్‌గా ఉంటాయి. పిల్లలు, పెద్దలు పొట్టలో నులిపురుగులు పోవడానికి వీటిని తింటూ ఉంటారు.
 ఈ వడియాలు సంవత్సరం వరకూ నిల్వ ఉంటాయి.