Apr 11,2021 16:42

కావాల్సిన పదార్థాలు : ఎండిన వేపపువ్వు- కప్పు, మినపప్పు- కప్పు, ఎండు మిరపకాయలు- 18 లేదా 20, కందిపప్పు- అరకప్పు, ఇంగువ- స్పూన్‌, జీలకర్ర- రెండు టీస్పూన్స్‌, ఉప్పు- సరిపడా.హొ
తయారుచేసే విధానం:
 ఎండిన వేపపువ్వు, మినపప్పు, ఎండు మిరపకాయలు, కంది పప్పులను విడివిడిగా వేగించుకోవాలి.
అవి చల్లారిన తర్వాత వాటన్నింటిని మిక్సీలో వేసుకోవాలి. అందులోనే ఇంగువ, జీలకర్ర, తగినంత ఉప్పు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.
 అంతే వేపపువ్వు పొడి రెడీ. దీనిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే సూపర్‌గా ఉంటుంది.